తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2020, 2:54 PM IST

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు బత్తాయిల పంపిణీ

రోగనిరోధక శక్తి పెంచే బత్తాయిలను పారిశుద్ధ్య కార్మికులకు పంచాలన్న మంత్రి జగదీశ్​రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

ORANGES DISTRIBUTION TO SANITATION EMPLOYEES IN MIRYALAGUDA
పారిశుద్ధ్య కార్మికులకు బత్తాయిల పంపిణీ

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే భాస్కరరావు, మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్ పండ్లను పంపిణీ చేశారు. 400 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బత్తాయిలను అందించారు.

రైతుల వద్ద నుంచి బత్తాయిలు కొనుగోలు చేసి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోని కార్మికులకు అందేలా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. బత్తాయి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో జిల్లా మంత్రి జగదీశ్​ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టినట్లు నేతలు తెలిపారు. బత్తాయిల్లో విటమిన్-సి ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తలచి కార్మికులకు పండ్లను పంపిణీ చేస్తున్నామన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు బత్తాయిల పంపిణీ

ఇదీ చదవండి:కరోనా కాలంలో కొత్త భయం- ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు

ABOUT THE AUTHOR

...view details