తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్ర వ్యవసాయ బిల్లులో గిట్టుబాటు ధర ప్రస్తావనేది?

ప్రతిపక్షాల గొంతు నొక్కి కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లుతో రైతులు నష్టపోతారని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. బిల్లులో రైతు.. తన పంటను స్వేచ్ఛగా అమ్ముకునే వీలుంది కానీ గిట్టుబాటు ధర విషయమై ప్రస్తావన లేదని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

one crore signatures collection against agriculture bill
కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా

By

Published : Oct 3, 2020, 4:10 PM IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు అన్యాయం జరగకుండా దేశవ్యాప్తంగా కర్షకులను చైతన్యపరిచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించామని మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రైతుల అభిప్రాయాలు సేకరించడానికే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో పాల్గొన్నారు.

ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ నిరంకుశ పాలన సాగుతోందని జానారెడ్డి విమర్శించారు. రెండు ప్రభుత్వాలు.. పోలీసుల ద్వారా.. ప్రతిపక్షాలను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. తెరాసకు చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ సీఎల్పీ జానారెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details