తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా అవంతిపురం మార్కెట్​ కమిటీ ప్రమాణస్వీకారం - nalgnda

నల్గొండ జిల్లా అవంతిపురం వ్యవసాయ మార్కెట్​ కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి జగదీశ్వర్​రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​రెడ్డి హాజరై సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా అవంతిపురం మార్కెట్​ కమిటీ ప్రమాణస్వీకారం

By

Published : Aug 25, 2019, 6:05 PM IST

నల్గొండ జిల్లా అవంతిపురం వ్యవసాయ మార్కెట్​ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. మార్కెట్​ కమిటీ ఛైర్మన్​గా చింతరెడ్డి శ్రీనివాస్​రెడ్డి ప్రమాణం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్​​రెడ్డి, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్​రెడ్డి పాల్గొన్నారు.

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 24 గంటల విద్యుత్​ సరఫరా చేసి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని మంత్రి తెలిపారు. మిషన్​ కాకతీయ ద్వారా చెరువులకు జలకళ తీసుకొచ్చామన్నారు. రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేసి రైతన్నలను అండగా నిలిచామని పేర్కొన్నారు. ఎన్నేళ్లు పదవిలో ఉన్నామనే దానికంటే ఎంత సేవచేశామన్నదే ముఖ్యమని ఎమ్మెల్సీ గుత్తా తెలిపారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మిర్యాలగూడ పట్టణం నుంచి అవంతిపురం మార్కెట్​ వరకు తెరాస కార్యకర్తలు ద్విచక్రవాహన ర్యాలీ చేశారు.

ఘనంగా అవంతిపురం మార్కెట్​ కమిటీ ప్రమాణస్వీకారం

ఇవీ చూడండి: ఆ ఊరిని పిశాచిలా పట్టుకున్న విషజ్వరాలు

ABOUT THE AUTHOR

...view details