నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల భగత్... హాలియాలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. తన నివాసానికి చేరుకున్న భగత్‌కు కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఎన్నికల్లో గెలుపొందిన ధ్రువీకరణ పత్రాన్ని తన తల్లి లక్ష్మి చేతిలో పెట్టి... దీవెనలు తీసుకున్నారు.
'ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉంటూ.. సేవలందించేందుకు సిద్ధం' - nomula bhagat win
నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్... తండ్రి నర్సింహయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని తల్లి చేతిలో పెట్టి దీవెనలు తీసుకున్నారు. ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉంటూ... సేవలందిస్తానని భగత్ తెలిపారు.
nomula bhagat tribute his father nomula narsimhaiah
అనంతరం తండ్రి నోముల నర్సింహయ్య చిత్ర పటానికి భగత్... నివాళులు అర్పించారు. తన గెలుపు కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ భగత్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.