నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పూజలు చేయాలని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఆయన గుర్తు చేశారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండి పండుగ చేసుకోవాలని, సామూహిక పూజల్లో తప్పనిసరి అయితేనే పాల్గొనాలని, కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.
మట్టి విగ్రహాలు పంచిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి - MLA Kancharla Bhupal Reddy
వినాయక చవితి సందర్భంగా నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆయన ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పట్టణ వాసులకు పంచారు. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలనే ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
మట్టి విగ్రహాలు పంచిన ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి