తెలంగాణ

telangana

తినడం గురించి మాట్లాడారు.. కొనడం గురించి మర్చిపోయారు

లాక్​డౌన్​ వల్ల తమ పంటకు మద్దతు ధర లభించడం లేదని నల్గొండ జిల్లా బత్తాయి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై బత్తాయి కాయలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు.

By

Published : May 9, 2020, 1:58 PM IST

Published : May 9, 2020, 1:58 PM IST

ETV Bharat / state

తినడం గురించి మాట్లాడారు.. కొనడం గురించి మర్చిపోయారు

Breaking News

నల్గొండ జిల్లా బత్తాయి రైతులు ఆందోళన బాట పట్టారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో అధిక సంఖ్యలో బత్తాయి సాగు చేస్తుంటారు. లాక్​డౌన్​ వల్ల తమ పంటకు మద్దతు ధర లభించడం లేదని రైతులు వాపోయారు.

రహదారులపై బత్తాయి కాయలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బత్తాయి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ బత్తాయి తినడం గురించి మాట్లాడారు కానీ కొనుగోలు గురించి పట్టించుకోలేదని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details