రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 12 కేజీల బియ్యంలో కేంద్రం ఇచ్చే రేషన్ ఎంత అనేది సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మున్సిపాలిటీ, ఆటో కార్మికులు, ఆశా వర్కర్లకు ఆయన నిత్యావసరాలు పంపిణీ చేశారు. కేంద్రం ఇచ్చే బియ్యం లెక్కలు చూపాలని.. రేషన్ కార్డు లేని వారి కుటుంబాలకు కూడా తక్షణమే 12 కేజీల బియ్యంతో పాటు రూ. 1500 నగదు ఇవ్వాలని కోరారు.
బత్తాయి, మామిడి మొదలైన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టాలి. ఉద్యోగులకు కోత విధించకుండా జీతాలు చెల్లించాలి. ఆశా వర్కర్లకు ఇప్పుడు ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదు. వారికోసం రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వాలతో పార్లమెంట్లో పొట్లాడుతాను.