నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.7,70,847 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 7,70,847 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 303.99 టీఎంసీలు ఉంది. ఇవాళ సెలవు దినం కావడం వల్ల సందర్శకుల రద్దీ పెరిగింది. దాదాపుగా 5కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
'నిండుకుండలా నాగార్జున సాగర్' - nagarjuna sagar
సాగర్ నిండుకుండలా మారింది. 4రోజులుగా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో.. డ్యాం దాదాపు నిండింది. 7,70,847 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే మెుత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. సందర్శకుల రద్దీ పెరగడటం వల్ల దాదాపు 5కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
nagarjuna sagar