నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఇవాళ అన్ని ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు నామపత్రాలు దాఖలు చేశారు. నిడమనూరు ఆర్వో కార్యాలయంలో.. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి... తెరాస అభ్యర్థి నోముల భగత్ నామపత్రాలు దాఖలు చేశారు.
సాగర్ సమరం: ముగిసిన నామినేషన్ల గడువు - telangana varthalu
సాగర్ ఉపఎన్నిక నామపత్రాల దాఖలు గడువు ముగిసింది. ఇవాళ ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు పలువురు నామపత్రాలు దాఖలు చేశారు.
సాగర్ ఉపఎన్నిక: ముగిసిన నామినేషన్ల గడువు
భాజపా అభ్యర్థి పానుగోతు రవికుమార్, తెదేపా నుంచి మువ్వా అరుణ్ కుమార్ నామపత్రాలు దాఖలు చేశారు. ఎన్నికల్లో గెలుస్తామని ఎవరికివారు ధీమా వ్యక్తం చేశారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఏప్రిల్ 3 వరకు గడువు ఉండగా... ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. మే 2న ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: నామినేషన్ వేసిన జానారెడ్డి, నోముల భగత్