నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి వస్తున్న వరద నీరు సాగర్‌కు చేరుకుంది. నాగార్జున సాగర్ 12 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి.. లక్షా 78వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‌ఫ్లో 2,18,621 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 2,18,621 క్యూసెక్కులుగా నమోదైంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ.. 12 గేట్లు ఎత్తివేత - నాగార్జున సాగర్ 12 గేట్లు ఎత్తివేత
ఎగువన భారీ వర్షాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. సాగర్ 12 గేట్లు 10 అడుగుల మేర అధికారులు ఎత్తి.. లక్షా 78వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్‌ఫ్లో 2,18,621 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 2,18,621 క్యూసెక్కులుగా నమోదైంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ.. 12 గేట్లు ఎత్తివేత
జలాశయం ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు ఉండగా... పూర్తి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి నిల్వ 310.52 టీఎంసీలు కాగా.. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలుగా నమోదైంది. రాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు 14 క్రస్ట్ గేట్స్ ఎత్తగా... ప్రస్తుతం 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఇవీ చూడండి :సాగర్ భారీ వరదతో టెయిల్‌పాండ్ 18 గేట్లు ఎత్తివేత