నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచార కూరగాయల వాహనాలను ఎమ్మెల్యే భాస్కర్రావు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో స్థానిక ఎస్ఎస్పీ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ప్రజలు సామాజిక దూరం పాటించడం కష్టమవుతోంది. ఇంటి వద్దకే కూరగాయలు చేరవేసే విధంగా ఈ మొబైల్ మార్కెట్లను ఏర్పాటు చేశారు.
లాక్డౌన్ ఎఫెక్ట్ ప్రజల వద్దకే మొబైల్ మార్కెట్లు - మొబైల్ మార్కెట్లు
కరోనా వ్యాప్తిని అరికట్టే నేపథ్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మొబైల్ మార్కెట్లను ఎమ్మెల్యే భాస్కర్రావు ప్రారంభించారు. ప్రజలు ఒకే వద్ద గుమిగూడి కూరగాయలు కొనుగోలు చేయకండా వారివారి కాలనీల్లోనే విక్రయాలు జరిపే విధంగా వీటిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు.
లాక్డౌన్ ఎఫెక్ట్ ప్రజల వద్దకే మొబైల్ మార్కెట్లు
ప్రజలందరూ ఒకే దగ్గర గుమిగూడి కూరగాయలు కొనకుండా ఏ కాలనీ వారు ఆ కాలనీలోనే కూరగాయలు, పండ్లు కొనుగోలు చేసుకునే విధంగా ఈ సంచార వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భాస్కరరావు సూచించారు.