నాగార్జునసాగర్ ఉపఎన్నికలో తెరాసకు షాక్ ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కోరారు. నల్గొండ జిల్లా హాలియాలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రఘనందన్ ప్రసంగించారు. రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లైనా కేసీఆర్ కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని దుయ్యబట్టారు.
'తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి' - తెలంగాణ తాజా వార్తలు
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని... భాజపా నేత రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులతో పాటు అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసిన తెరాసకు... ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలని అభ్యర్థించారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.
'తన కుటుంబంలో మాత్రామే ఉద్యోగాలు వచ్చాయి'
ఆ ర్యాలీలో రాష్ట్ర భాజపా ఇంఛార్జీ తరుణ్ చుగ్ పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగులకు తెరాస ప్రభుత్వం అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కండవా కప్పి ఆహ్వానించారు.
ఇదీ చూడండి :ఆరేళ్లలో 1,32,899 ఉద్యోగాల భర్తీ... చిత్తశుద్ధి మాకే ఎక్కువ: కేటీఆర్