తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ మంత్రిని కలిసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునిత

ఏఈవోల దగ్గర ఆగిపోయిన రైతు బీమా పథకం దరఖాస్తులు ఆన్​లైన్​లో నమోదు చేయడానికి అవకాశం కల్పించాలని కోరుతూ.. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్​ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డిని కలిశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వెబ్​సైట్​ను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

MLA Gongidi Sunitha Meets Minister Niranjan Reddy
వ్యవసాయ మంత్రిని కలిసిన ప్రభుత్వ విప్ గొంగిడి సునిత

By

Published : Sep 22, 2020, 2:17 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబీమా పథకం లబ్దిదారులను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీలోగా వెబ్​సైట్​లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే.. సాంకేతిక కారణాల వల్ల రైతుబీమా వెబ్​సైట్​ నిలిపివేశారు. రైతులకు సంబంధించిన చాలా దరఖాస్తులు ఏఈవోల దగ్గరే ఆగిపోయాయి. రైతులకు న్యాయం జరిగేలా.. రైతుబీమా దరఖాస్తు చేసుకోవడానికి.. వెబ్​సైట్​ తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వ విప్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్​ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించి మంత్రి.. తగిన ఆదేశాలు జారీ చేసి.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details