నల్గొండ జిల్లా కుంకుడు చెట్టు తండాలో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దవూర మండలం పరిధిలోని తండాలో దాదాపు రూ.2.47కోట్లతో చేపట్టిన లిఫ్ట్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్‌తో 14 గ్రామాల పరిధిలోని 7,163 ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు.
వానాకాలంలో నీళ్లు
కుంకుడు చెట్టు తండా, చలకుర్తి, బెట్టెల తండా, గాత్ తండా, తుటుపేట తండా, రంగుళ్ల తండా, పాషవారి గూడెం, పెద్ద భాయ్ తండా, శ్రీరామ్పల్లి, ఎల్లాపురం, గరికనేటు తండా, బోయగూడా, ఆల్వాల్, కొంపల్లి గ్రామాల రైతులకు మేలు జరగనుందని పేర్కొన్నారు. వచ్చే వానా కాలంలోపు పనులు పూర్తి చేసి నీరు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇరిగేషన్ ఇంజినీరింగ్ చీఫ్ మురళీధర్ రావు, స్థానిక ఎస్ఈ అజయ్‌తో పనుల పురోగతిపై చర్చించారు.