తెలంగాణ

telangana

ETV Bharat / state

'బత్తాయి పంట ఎగుమతికి అన్ని చర్యలు తీసుకున్నాం'

బత్తాయి పంట ఎగుమతికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిరంజన్​ రెడ్డి వెల్లడించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బత్తాయి కొనుగోళ్లపై... అధికారులు, ట్రేడర్లతో మంత్రులు నిరంజన్​ రెడ్డి, జగదీశ్​ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ministers review on green orange export
'బత్తాయి పంట ఎగుమతికి అన్ని చర్యలు తీసుకున్నాం'

By

Published : Apr 12, 2020, 7:27 PM IST

బత్తాయి పంట కొనుగోళ్లు, ఎగుమతులపై నల్గొండ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో అధికారులు, వర్తకులతో మంత్రులు నిరంజన్​ రెడ్డి, జగదీశ్​ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బత్తాయి రైతులకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నిరంజన్​ రెడ్డి వివరించారు. ఎగుమతుల విషయంలో కేంద్ర మంత్రితో చర్చించి పరిస్థితిని వివరించామని... కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు నిరంజన్​ రెడ్డి వివరించారు.

జిల్లాలోని పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేందుకు అన్ని అనుమతులు ఇచ్చామని.. రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.

'బత్తాయి పంట ఎగుమతికి అన్ని చర్యలు తీసుకున్నాం'

ఇదీ చూడండి:'మర్కజ్​ కేసులతో అంచనాలన్నీ తారుమారయ్యాయి'

ABOUT THE AUTHOR

...view details