నెల్లికల్ ఎత్తిపోతల పథకంపై తన మాటకు కట్టుబడి ఉన్నానని నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఇంఛార్జి, మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు ఏడాదిన్నరలోగా పూర్తికాకపోతే తప్పకుండా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో చెప్పుకోవడానికి జానారెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో జానారెడ్డి పట్టించుకోకపోవడం వల్లే... తాము అక్కడి సమస్యలపై దృష్టిసారించామని తెలిపారు. వాళ్లు అభివృద్ధి చేస్తే గత ఎన్నికల్లోనే విజయం సాధించేవారని వ్యాఖ్యానించారు. 2018లో నెల్లికల్ ఎత్తిపోతలపై హామీ ఇచ్చామన్న మంత్రి... ఆ మాట ప్రకారమే ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారని గుర్తు చేశారు. ప్రాజెక్టు విషయంలో రాజీపడేది లేదన్న మంత్రి... రాజీనామా చేస్తానన్న మాటకు తగ్గేది లేదన్నారు.