Minister Jagadish reddy: గురువారం.. సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసోం సీఎం కంటే రేవంత్ రెడ్డి సంస్కార హీనుడన్న మంత్రి.. ఉన్నత పదవుల్లో ఉన్న వారు సంస్కారయుతంగా వ్యవహరించాలని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను ఖండించారు.
అసోం సీఎం కంటే సంస్కార హీనుడు రేవంత్ రెడ్డి: మంత్రి జగదీశ్ రెడ్డి - jagadeesh reddy latest news
Minister Jagadish reddy: సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు సంస్కారయుతంగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ అన్నారని మంత్రి గుర్తు చేశారు.
మంత్రి జగదీశ్ రెడ్డి, నకిరేకల్‌లో రక్తదాన శిబిరం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా.. రేవంత్ రెడ్డి ఇతర పార్టీలకు కోవర్ట్‌గా పనిచేసి రాష్ట్రాన్ని బలహీన పరిచే చర్యలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తద్దినం పెట్టడానికి రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నుంచి కోవర్టుగా వచ్చారని.. ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో చెప్పారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి:KTR Comments on Modi : 'మోదీకి మరో అవకాశమిస్తే.. తెలంగాణ-ఆంధ్రాను కలిపేస్తారు'