తెలంగాణ

telangana

By

Published : May 8, 2021, 12:52 PM IST

ETV Bharat / state

'సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలి'

కరోనా విపత్కర కాలంలో దాతలు తమవంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సర్వారం గ్రామంలో మాస్కులు పంపిణీ చేశారు. గ్రామస్థులకు వైరస్​పై అవగాహన కల్పించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

masks distribution at sarvaram, lions club masks distribution
సర్వారంలో మాస్కుల పంపిణీ, లయన్స్ క్లబ్ మాస్కుల పంపిణీ

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమవంతు సాయంగా లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారo గ్రామంలోని కూలీలకు, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలకు మాస్కులు పంపిణీ చేశారు. కొవిడ్ రెండో దశ ప్రభావం తీవ్రంగా ఉన్నందున గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పనులకు వెళ్లే సమయంలో, బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా విపత్కర సమయంలో సాయం చేయడానికి అందరూ ముందుకు రావాలని ఫౌండేషన్ సభ్యుడు నర్సింహ రావు కోరారు. ఈ కార్యక్రమంలో తగుళ్ల శ్రీను, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కొవిడ్‌ చికిత్సలో సీటీ స్కాన్‌ ఎంత మేరకు ఉపయోగపడుతుంది?

ABOUT THE AUTHOR

...view details