రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన 139 మంది అత్యాచార కేసుపై బాధితురాలు మరికొన్ని విషయాలు తెలిపింది. డాలర్‌భాయ్ అలియస్ శ్రీకర్‌రెడ్డి ఒత్తిడి వల్లే 139 మందిపై కేసు పెట్టినట్లు బాధిత యువతి పేర్కొంది. తాను తప్పుడు కేసులు పెట్టినవారికి క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. ఈ కేసుతో నటుడు కృష్ణుడికి, యాంకర్ ప్రదీప్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. డాలర్ భాయ్‌పై ఫిర్యాదు చేస్తానని వివరించింది.
అయితే యువతిపై అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. యువతికి ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించాలని పేర్కొన్నారు. 139 మందిలో 30మంది అత్యాచారం చేశారని యువతి చెప్పారని మందకృష్ణ తెలిపారు. మిగితా వారు వేధింపులకు గురిచేశారని యువతి చెప్పిందని స్పష్టం చేశారు.