నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ తెల్లవారుజామున బోల్తా పడింది. అక్రమ బియ్యం వ్యాపారం చేస్తున్న వారు ఈ విషయం పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తెల్లవారుజామునే బోల్తా పడిన లారీని ఘటన స్థలం నుంచి తీసుకెళ్లారు.
బియ్యం లారీ బోల్తా.. అందినకాడికి దోచుకెళ్లేశారు! - నల్గొండ జిల్లా వార్తలు
బియ్యం తీసుకెళ్తున్న లారీ బోల్తా పడింది. బియ్యం బస్తాలు కింద పడ్డాయి. ఇక ఇప్పుడు మొదలైంది అసలు కథ. బియ్యం బస్తాలు తీసుకెళ్లెందుకు పోటీ పడ్డారు జనాలు. ఒక్కొకరు రెండు, మూడు బస్తాలు తీసుకెళ్లారు. కొందరు ఎత్తుకెళ్లగా.. మరికొందరు ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో తీసుకెళ్లారు. ఈ ఘటన నల్గొండ జిల్లా ముకుందాపురంలో జరిగింది.
అక్రమ బియ్యం తరలిస్తున్న లారీ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
బియ్యాన్ని మాత్రం అక్కడే వదిలి వెళ్లటంతో రోడ్డు పక్కన వెళ్లే జనం బియ్యం కోసం ఎగబడ్డారు. బియ్యం బస్తాలను ఆటోల్లో, ద్విచక్రవాహనంపై తరలించారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న పోలీసులు బియ్యం కోసం వస్తున్న జనాలను అడ్డుకున్నారు.
ఇదీ చదవండి:ఫోన్ కోసం 60 అడుగుల బావిలో నీటిని తోడేశాడు!