లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కారణం లేకుండా బయటకు వచ్చేవారి వాహనాలు సీజ్ చేస్తున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.
కరోనా కట్టడికి లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో డ్రోన్ కెమెరా ద్వారా కాలనీల్లో పరిస్థితిని పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారి వాహనాలను జప్తు చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అత్యవసరాలు, వైద్య చికిత్స కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.