నల్గొండ ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన సూపర్ స్ప్రెడర్ల టీకా కేంద్రానికి(super spreader vaccination)... వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. రోజుకు 850 మందికే పరిమితి ఉండటం వల్ల... మిగతా వారంతా నిరాశగా వెనుదిరుగుతున్నారు.
super spreader: పెద్ద ఎత్తున స్పందన.. టీకా కోసం పడిగాపులు - నల్గొండ తాజా వార్తలు
సూపర్ స్ప్రెడర్లకు అందజేస్తున్న వ్యాక్సిన్ కార్యక్రమానికి(super spreader vaccination) పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారు. టీకా కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు గాస్తున్నారు. తాజాగా నల్గొండ ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రంలో రోజుకు 850 మందికి మాత్రమే పరిమితి ఉండటం వల్ల మరికొంత మంది వెనుదిరుగుతున్నారు.
super spreader: పెద్ద ఎత్తు స్పందన.. టీకా కోసం పడిగాపులు
ఈ నెల 5న టీకా వేయడం ప్రారంభం కాగా... 10 రోజులపాటు కార్యక్రమం కొనసాగనుంది. రేషన్ డీలర్లు, కిరాణ, మాంసం విక్రయదారులు, వివిధ దుకాణాలు, కూరగాయల మార్కెట్ల వ్యాపారులతో పాటు పలు వర్గాలకు టీకా అందిస్తున్నారు. నిత్యం పురపాలిక నుంచి వచ్చే రిజిస్ట్రేషన్ల సంఖ్య, ఫోన్కు వచ్చిన సంక్షిప్త సందేశం ఆధారంగా టీకా వేస్తున్నారు.
ఇదీ చూడండి:CS: 'సరిహద్దు గ్రామాల్లో నివారణ చర్యలు చేపట్టండి'