నల్గొండలో ఉన్న కాంగ్రెస్ దిగ్గజాలను ఒంటి చేత్తో మట్టికరిపించి తెరాసకు పట్టం కట్టిన ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లోను అదే పంథా కొనసాగించాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆకాంక్షించారు. నల్గొండ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గులాబీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 16 మంది ఎంపీలను గెలిపిస్తే దిల్లీని శాసించే స్థాయికి రాష్ట్రం ఎదుగుతుందని వివరించారు.
సారు కారు పదహారు, దిల్లీల మనం చెప్పిందే సర్కారు - కేటీఆర్
సారు...కారు... పదహారు... నల్గొండ వాళ్లు చెప్పిందే దిల్లీలో సర్కారు అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నినదించారు. రాష్ట్రంలో 16 మంది తెరాస ఎంపీలను గెలిపిస్తే దిల్లీని నియంత్రించే సత్తా తెలంగాణకు వస్తుందని తెలిపారు.
నల్గొండ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్