పట్టభద్రుల ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో మరోసారి ఘన విజయం నమోదు చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరేళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఫ్లోరైడ్ నుంచి విముక్తి కలిగిందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచే వరకు పక్కాగా పనిచేయాలని పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఏమరపాటు వద్దు... ఆ ఎన్నికల్లో సత్తా చాటాలి: కేటీఆర్ - కేటీఆర్ వార్తలు
15:23 January 16
ఉమ్మడి నల్గొండ జిల్లా తెరాస నేతలతో కేటీఆర్ సమావేశం
తెరాస కార్యకర్తలందరినీ మరింత క్రియాశీలకం చేయాలని.. ప్రతీ ఓటరును కలవాలని నేతలకు కేటీఆర్ సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు.. భర్తీ కానున్న వాటిని పట్టభద్రులకు వివరించాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భాజపా ప్రభావం ఉండదని.. కాంగ్రెస్ బలహీనంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
నాగార్జునసాగర్‌లో మళ్లీ తెరాస జెండా ఎగురుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో చూపించిన సత్తా నాగార్జునసాగర్‌లోనూ ప్రదర్శించాలన్నారు. అన్ని విధాలుగా పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. అతివిశ్వాసంతో కానీ ఏమరుపాటుగా కానీ వ్యవహరించవద్దని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :భవిష్యత్‌కు ఆశాకిరణం.. కొవిడ్ వ్యాక్సిన్ : మంత్రి కేటీఆర్