తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Comments on PM Modi : 'రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేశారు'

KTR Comments on PM Modi : నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్​.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేయనందున.. అన్నదాతలు చనిపోయినట్లు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కొవిడ్ వచ్చినా రెండుసార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దే అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Nalgonda District
KTR

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 7:01 PM IST

Updated : Oct 2, 2023, 7:17 PM IST

KTR Comments on PM Modi In Nalgonda : నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ (KTR) పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మర్రిగూడ బైపాస్ వద్ద రూ.45 కోట్లతో పైవంతెనకు శంకుస్థాపన చేశారు. రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీహబ్​ను, రూ.146.60 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన.. చేనేత కార్మికులకు మరమగ్గాలను పంపిణీ చేశారు.

KTR Visit to Nalgonda District : అనంతరం ఎన్జీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ రావట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్ రావట్లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (KomatiReddy Venkat Reddy) ప్రగల్భాలు పలుకుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లి అయినా విద్యుత్‌ తీగలు పట్టుకుని చూడాలని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR Speech in Wanaparthy Ten Years Progress : 'తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకంత కక్ష?'

KTR Comments on Congress :నాడు విద్యుత్‌ ఉంటే వార్త.. నేడు విద్యుత్‌ పోతే వార్త అని కేటీఆర్ పేర్కొన్నారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలని ఎవరు విమర్శించారని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పరిశ్రమలు, ఐటీ హబ్‌లు, వైద్య కళాశాలలు రాలేదని.. సాగు, తాగు నీరు ఇవ్వలేదని తెలిపారు. జిల్లాలో ఫ్లోరోసిస్‌తో లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారని.. ఈ ప్రాంతం నుంచి ఫ్లోరోసిస్‌ను తరిమిన ఘనత కేసీఆర్‌దే అని కేటీఅర్ స్పష్టం చేశారు.

నల్గొండలో భవిష్యత్​లో పుట్టే పిల్లలు చందమామలా ఉంటారని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 13 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన మేనమామ కేసీఆర్‌ అని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో ఉన్న పింఛన్‌ రూ.200 నుంచి రూ.2,000 పెంచినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో దివ్యాంగులకు రూ.4016 పింఛన్‌ అందజేస్తున్నామని అన్నారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Kitex and Sintex Companies Invests in Telangana : రాష్ట్రానికి మరో రెండు కొత్త పరిశ్రమలు.. 1200 వేల మందికి ఉపాధి

KTR Fires on PM Modi :రాష్ట్రంలో 1,001 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు వచ్చి ప్రధాని మోదీ(PM Modi )అబద్ధాలు ప్రచారం చేశారని.. రైతు రుణమాఫీ చేయనందున అన్నదాతలు చనిపోయినట్లు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. కరోనా వచ్చినా రెండుసార్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దే అని కేటీఆర్ స్పష్టం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​ రెడ్డి (Kancharla Bhupal Reddy) సభలో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ఒంటి చెయ్యితో ఏం చేస్తాడని గత పాలకులు హేళన చేశారని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్​రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, నోముల భగత్, రవీంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.

"రాష్ట్రంలో 24 గంటల విద్యుత్‌ రావట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారు. విద్యుత్‌ రావట్లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లి అయినా విద్యుత్‌ తీగలు పట్టుకుని చూడాలి. నాడు విద్యుత్‌ ఉంటే వార్త.. నేడు విద్యుత్‌ పోతే వార్త. రైతులకు 3 గంటల విద్యుత్‌ చాలని ఎవరు విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో పరిశ్రమలు, ఐటీ హబ్‌లు, వైద్య కళాశాలలు రాలేదు. కాంగ్రెస్‌ హయాంలో సాగు, తాగు నీరు ఇవ్వలేదు." - కేటీఆర్, మంత్రి

KTR Comments on PM Modi రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేశారు

KTR At Malakpet IT Park Opening : "బీఆర్‌ఎస్ స్టీరింగ్‌ కేసీఆర్ చేతిలో కానీ.. బీజేపీది మాత్రం అదానీ చేతిలో ఉంది"

Minister KTR Tour in Ramagundam : కేసీఆర్​ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం: కేటీఆర్

Last Updated : Oct 2, 2023, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details