మోగిన నగారా... అక్టోబర్ 21న హుజూర్‌నగర్ ఉపఎన్నిక - హుజూర్‌నగర్ ఉపఎన్నిక
నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. అక్టోబర్ 21న ఎన్నికలు నిర్వహించనున్నారు.
హుజూర్‌నగర్ ఉపఎన్నిక
నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించింది. అక్టోబర్ 21 ఎన్నికలు, 24 న ఓట్ల లెక్కింపు చెపట్టనుంది. 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన నల్గొండ ఎంపీగా పోటీ గెలుపొందారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉత్తమ్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూలు ప్రకటించింది.
నామినేషన్ల స్వీకరణ | సెప్టెంబర్ 23 |
నామినేషన్‌కు తుది గడువు | సెప్టెంబర్ 30 |
నామినేషన్ల పరిశీలన | అక్టోబర్ 1 |
ఉపసంహరణ | అక్టోబర్ 3 |
ఎన్నికలు | అక్టోబర్ 21 |
ఫలితాలు | అక్టోబర్ 24 |
Last Updated : Sep 21, 2019, 1:14 PM IST