సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని వివాదాస్పద 540 భూముల విషయంలో చర్చకు సిద్ధమా అంటూ.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సవాల్ విసిరారు
మఠంపల్లి మండలంలోని వివాదాస్పద 540 భూములలో పర్యటించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి.. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమాయక గిరిజనుల మధ్య వివాదాలు సృష్టిస్తే సహించేది లేదని తెలిపిన ఆయన.. 540 భూములపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకోని వెళ్లగా .. దానిపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ స్పందించారని గుర్తు చేశారు. ఈ భూముల విషయమై ఎక్కడైనా.. ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు.
సహించేది లేదు..
గతంలో గిరిజనులపై దాడి చేసి, వారిపైనే కేసులు పెడితే తానే స్వయంగా బెయిల్ ఇప్పించి బయటికి తీసుకు వచ్చానని తెలిపిన ఎమ్మెల్యే.. వారిపై దాడి చేస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ విమర్శలు చేసుకోవాలంటే అది ఎలాగైనా చేసుకోవచ్చని.. దాని కోసం రైతులను ఇబ్బంది పెడతాను అంటే సహించేది లేదన్నారు. ఈ సందర్బంగా అర్హులైన ప్రతి గిరిజనుడికి పట్టా ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఎవరు ఎటువంటి అధైర్య పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కొందరు రైతులను అడ్డం పెట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పిన ఎమ్మెల్యే.. అలాంటి వారి మాటలు వినొద్దని కోరారు.
ఇదీ చదవండి:ఊర్లో ప్రియురాలు, దుబాయ్లో ప్రియుడు ఆత్మహత్య