తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే

హైదరాబాద్​- విజయవాడ జాతీయ రహదారిలో నివసిస్తోన్న నిరుపేదలపై ఈనాడు- ఈటీవీ భారత్​ ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. నల్గొండ జిల్లా నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేదలకు నిత్యావరాలతో పాటు నగదు సాయం అందించారు.

HUGE RESPONSE TO EENADU NEWS AND MLA HELP THAT POOR PEOPLE
ఈనాడు కథనానికి స్పందన... పేదలకు సాయమందించిన ఎమ్మెల్యే

By

Published : Apr 19, 2020, 4:42 PM IST

సంచార జీవనం సాగిస్తున్న మూడు కుటుంబాలకు... నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిత్యావసరాల్ని అందజేశారు. బియ్యం, వంటనూనెలు, ఇతర సరకులతోపాటు... 5 వేల నగదును అందించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలోని ఏపీ లింగోటం గ్రామ సమీపంలో... ఆయా కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి.

'బుక్కెడు బువ్వ కరువైపాయె' పేరిట ఈనాడు-ఈటీవీభారత్​లో వచ్చిన కథనానికి స్పందించిన రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్... చిరుమర్తితో చరవాణిలో మాట్లాడారు. వారికి వెంటనే సహాయం అందించాలని సూచించగా... నిత్యావసరాలు అందించారు. అటు స్థానిక పోలీసులు సైతం తోచినంత సాయమందించారు.

ఈనాడు కథనానికి స్పందన... పేదలకు సాయమందించిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి:-గృహ హింసకు పాల్పడితే క్వారంటైన్​కే!

ABOUT THE AUTHOR

...view details