చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కల్యాణం కమనీయంగా జరిగింది.ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కల్యాణం
By
Published : Feb 13, 2019, 11:05 AM IST
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి కల్యాణం
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. వేకువజామునే వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేశారు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి రాష్ట్రప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేడుకలను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.