తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉదయం చేరితే సాయంత్రం దాకా ఎందుకు చూడలేదు' - corona cases in nalgonda

దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా నల్గొండ జిల్లాలోని కరోనా మృతిపై హెచ్చార్సీ సుమోటో కేసు నమోదు చేసింది. ఆగష్టు 21లోగా ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్​ను ఆదేశించింది.

hrc sumoto case on corona death in nalgonda
hrc sumoto case on corona death in nalgonda

By

Published : Jul 19, 2020, 3:35 PM IST

నల్గొండ జిల్లాలో తల్లి కళ్లెదుటే తన కుమారుడు ఆక్సిజన్ అందక కరోనాతో మృతి చెందిన ఘటనపై... దినపత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. ఆగష్టు 21లోగా ఈ ఘటన పై సమగ్ర నివేదిక ఇవ్వాలని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్​ను ఆదేశించింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్-19 వార్డులో ఆక్సిజన్ అందక మాడుగులపల్లి మండలం సల్కునూర్‌కి చెందిన వ్యక్తి ఈనెల 18న మరణించాడు.

బాధితుడు ఆసుపత్రిలో ఉదయం చేరగా... సాయంత్రం వరకు ఒక్క వైద్యుడు కూడా రాకపోవటం వల్ల బెడ్ మీదనే ప్రాణాలు కోల్పోవడంపై హెచ్చార్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితునికి కరోనా పరీక్షలు ఎప్పుడు చేశారు.. పాజిటివ్​ అని నిర్ధరణ కాకుండానే కొవిడ్ వార్డులో ఎందుకు చేర్చారు.. చేర్చుకున్నాక ఆక్సిజన్ ఎందుకు పెట్టలేదంటూ.. సూపరింటెండెంట్​పై హెచ్చార్సీ ప్రశ్నల వర్షం కురిపించింది. కొవిడ్ వార్డుకు ఇతరులు పోవడానికి ఆనుమతి లేనప్పుడు ఆ తల్లి ఎలా పోయింది.. ఎవరైనా ఆపారా లేదా అని ప్రశ్నించింది.

ఇదీ చూడండి:బీసీజీ టీకా కరోనా నుంచి రక్షిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details