తెలంగాణ

telangana

వెలిమినేడు చెరువులో పెద్దఎత్తున చేపలు మృతి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు చెరువులో పెద్దఎత్తున చేపలు మృతిచెందాయి. విష రసాయనాల ప్రభావం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మత్య్సకారులు ఆరోపించారు.

By

Published : Oct 27, 2020, 3:55 PM IST

Published : Oct 27, 2020, 3:55 PM IST

వెలిమినేడు చెరువులో పెద్దఎత్తున చేపలు మృతి
వెలిమినేడు చెరువులో పెద్దఎత్తున చేపలు మృతి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు చెరువులో... పెద్దఎత్తున చేపలు మృత్యువాతపడ్డాయి. విష రసాయనాల ప్రభావం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని... గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెలిమినేడు జమ్మికుంట చెరువులో... నీరు రంగు మారడానికి రసాయనాలే కారణమని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

సుమారు నాలుగైదు టన్నుల చేపల్ని కోల్పోయామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన వారిని శిక్షించాలంటూ... సర్పంచితోపాటు మత్స్యకారులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

వెలిమినేడు చెరువులో పెద్దఎత్తున చేపలు మృతి

ఇదీ చూడండి: అంజన్‌రావు ఇంట్లో నగదు సీజ్‌ చేసిన దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details