తెలంగాణ

telangana

ETV Bharat / state

భానుడి ప్రతాపం... మయూరాలకు మృత్యుపాశం - నల్గొండ తాజా వార్తలు

ఎండవేడిమి తాళలేక నెమళ్లు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లిలో జరిగింది. గ్రామ శివారులోని చెరువులో 16 మయూరాలు మృతిచెందాయి.

HEAT WAVE KILLS 16 PEACOCKS
భానుడి ప్రతాపం... మయూరాలకు మృత్యుపాశం

By

Published : May 23, 2020, 2:10 PM IST

Updated : May 23, 2020, 4:36 PM IST

భానుడి ప్రతాపానికి మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వేడికి మనుషులతో పాటు పశు పక్ష్యాదులు విలవిల్లాడుతున్నాయి. గురువారం నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామ శివారులోని చెరువులో 16 మయూరాలు మృతి చెందాయి.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫారెస్ట్​ అధికారులు చనిపోయిన నెమళ్లకు పోస్టుమార్టం నిర్వహించారు. వేడిమి తట్టుకోలేక పోవడం వల్లనే చనిపోయినట్టు భావిస్తున్నారు. వాటి నుంచి శాంపిల్స్​ సేకరించి పరీక్షల కొరకు పంపారు. నివేదిక వచ్చిన తరవాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఫారెస్ట్​ అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి:కరోనా నుంచి కోలుకున్న తర్వాత మెడనొప్పి!

Last Updated : May 23, 2020, 4:36 PM IST

ABOUT THE AUTHOR

...view details