నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కేసుల వివరాలు, టీకాల పంపిణీ, జ్వర సర్వేపై ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు చేపట్టిన జ్వర సర్వేలో జిల్లా అధికారులు విఫలమయ్యారని రిజ్వీ అన్నారు.
ఫీవర్ సర్వేపై ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అసంతృప్తి - telangana news 2021
కరోనా కట్టడికి నిర్వహించిన జ్వర సర్వేలో నల్గొండ జిల్లా అధికారులు విఫలమయ్యారని ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణ, కేసుల వివరాలు, టీకా పంపిణీ తదితర అంశాలపై జిల్లా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
నల్గొండ జిల్లాలో ఫీవర్ సర్వే, నల్గొండ జిల్లాలో కరోనా కేసులు
జిల్లాలో లాక్డౌన్కు ముందు 38 శాతం ఉన్న కేసులు.. ప్రస్తుతం 18 శాతానికి తగ్గాయని కలెక్టర్ పీజే పాటిల్ తెలిపారు. ఆరోగ్య శాఖ నిర్దేశించిన 5 శాతానికి చేరుకోవడానికి అధికారులంతా కృషి చేస్తామని చెప్పారు. అధికారులంతా సమన్వయంతో.. కొవిడ్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకోవాలని రిజ్వీ సూచించారు.