నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోల్‌లో ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కోటేశ్వరరావు, స్థానిక పోలీసులు, ప్రజా ప్రతినిధులతో కలసి మొక్కలు నాటారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికులను ఆయన శాలువాలతో ఘనంగా సత్కరించారు.
'ప్రభుత్వం వారిని విలేజ్ వారియర్స్‌గా ప్రకటించాలి'
ప్రతి జర్నలిస్టు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ఏడబ్యూజేఏ జాతీయ అధ్యక్షుడు కోటేశ్వరరావు తెలిపారు. నల్గొండ జిల్లా కొండ్రపోల్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.
'పారిశుద్ధ్య కార్మికులను విలేజ్ వారియర్స్‌గా ప్రకటించాలి'
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని పచ్చదనాన్ని కాపాడుతూ, పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. గ్రామ పారిశ్యుధ్య కార్మికులను విలేజ్ వారియర్స్‌గా ప్రకటించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి:'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'
Last Updated : Jul 8, 2020, 7:56 PM IST