తెలంగాణ

telangana

ETV Bharat / state

'మద్దతు ధర కోసం ధాన్యాన్ని ఆరబెట్టాలి' - నల్గొండ జిల్లా తాజా వార్తలు

మిర్యాలగూడలోని అవంతిపురం, దామరచర్ల మండల కేంద్రాల్లోని మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి ప్రారంభించారు. స్థానిక రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

grain purchase centres at miryalaguda and damaracherla in nalgonda
'మద్దతు ధర కోసం ధాన్యాన్ని ఆరబెట్టాలి'

By

Published : Nov 19, 2020, 12:10 PM IST

మిల్లుల వద్ద సన్నరకం ధాన్యం రద్దీ తగ్గించడానికి వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి తెలిపారు. రైతులు మార్కెట్ యార్డుల్లో ధాన్యాన్ని అమ్ముకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని అవంతిపురం, దామరచర్ల మండల కేంద్రాల్లోని సబ్ మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

మద్దతు ధర కోసం రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాలని... దామరచర్ల, మిర్యాలగూడ ప్రాంతాల్లోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పంటను అమ్ముకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం... ఇద్దరు యువకుల దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details