Graduate MLC by Election In Telangana : వరంగల్ - నల్గొండ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2021 మార్చిలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలుజరగ్గా, 2027 ఏప్రిల్ వరకు పదవీ కాలం ఉంది. పల్లా రాజీనామాతో ఎమ్మెల్సీ సీటు ఖాళీ కావడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు.
పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక!
Voter Registration Process in MLC by Election :డిసెంబరు 30న ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో అధికారికంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికకు నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా ఉండగా, అదనపు కలెక్టరు జె.శ్రీనివాస్ ఓటరు నమోదు అధికారిగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ కలెక్టరేట్‌లోనే ఈ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది.
ఫిబ్రవరి 18 వరకు ఓటరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండగా, ఏప్రిల్ 4న తుది ఓటరు జాబితాను వెల్లడించనున్నారు. ఈ ఎన్నిక ఏప్రిల్ చివరిలో గానీ, మే నెల మొదటి వారంలో గానీ ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి నెలాఖరులో నోటిఫికేషన్ వెలువడి, మార్చి రెండో వారంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో ఈ ఉప ఎన్నికపార్లమెంటు ఎన్నికల తర్వాతే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పక్కా : ఎంపీ లక్ష్మణ్