కరోనా ఉద్ధృతి సమయంలో రెడ్‌క్రాస్ సొసైటీ (Governor On Redcross Socity) అమోఘమైన సేవలు అందించిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai Soundararajan) కొనియాడారు. అందుకే రెడ్‌క్రాస్‌కు యువత నుంచి సభ్యత్వాలు పెరుగుతున్నట్లు వివరించారు. నల్గొండలో పర్యటించిన తమిళిసై తొలుత ప్రైవేటు ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెడ్‌క్రాస్ భవనంలో సెమినార్ హాలుతోపాటు అంబులెన్స్ ప్రారంభించారు.
Governor On Redcross Socity: 'కరోనా సమయంలో అమోఘమైన సేవలు' - రెడ్‌క్రాస్ సొసైటీపై గవర్నర్ వ్యాఖ్యలు
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilsai Soundarajan) నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రెడ్‌క్రాస్ భవనంలో సెమినార్ హాలుతోపాటు అంబులెన్స్ ప్రారంభించారు.
Governor On Redcross Socity
అంతకముందు చారిత్రక ఛాయాసోమేశ్వరాలయాన్ని... గవర్నర్ తమిళిసై సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి బిల్వార్చన, అభిషేకం నిర్వహించారు. ఆలయ విశిష్టతతోపాటు శివలింగంపై అనునిత్యం ప్రసరించే ఛాయ గురించి చరిత్రకారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో గవర్నర్‌కు స్వాగతం పలికారు.
ఇదీ చూడండి:Cm Kcr Speech In Assembly: 'ఊరికొక పంచాయతీ కార్యదర్శి ఏ రాష్ట్రంలోనూ లేరు'