భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జలాశయం 18 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 3,69,776 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 3,69,776 క్యూసెక్కులుగా ఉంది.
నాగార్జునసాగర్ 18 గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. జలాశయం 18 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రస్తుత నీటిమట్టం 589 అడుగులు ఉండగా.. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 309.64 టీఎంసీలు ఉంది.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం