తెలంగాణ

telangana

ETV Bharat / state

Fish Food Festival In Telangana : ఆ చేపల పులుసు.. ఆహా అదిరింది బాసూ

Telangana Fish Food Festival 2023 : నాన్​వెజ్ ప్రియులకు చికెన్​, మటన్​ తిని బోరు అనిపించినప్పుడు.. వారి దృష్టి చేపలమీదకు వెళ్తుంది. చేపలతో పులుసు, వేపుడు, పచ్చడి సహా పలు రకాల వంటకాలు చేసుకోవచ్చు. ఇలా వంటకం ఏదైనా సరే రుచిలో మాత్రం వీటికి మించింది మరోకటి ఉండదు. ఒక్కసారి ఆ వంటకం రుచి చూస్తే చాలు మళ్లీమళ్లీ తినాలానిపిస్తుంది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఊరూరా చెరువుల పండుగ జరుగుతున్నాయి. అదేవిధంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు, రేపు, ఎల్లుండి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్​ను నిర్వహిస్తోంది.

Fish Food Festival In Telangana
Fish Food Festival In Telangana

By

Published : Jun 8, 2023, 10:44 AM IST

Fish Food Festival In Telangana Decade Celebrations 2023 : అత్యంత ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలలో చేపలు కూడా ఒకటి. వీటిని మనం ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెరైటీ వంటకంగా దీనిని వండుకుంటారు. అదిరిపోయే రుచి వీటి సొంతం. అలాగే శాలిగౌరారం చేపలు రుచిలో అదుర్స్‌.. చేపల పులుసు, పచ్చడి, వేపుడు.. ఇలా వంటకం ఏదైనా గానీ రుచిలో మాత్రం వాటిదే ప్రత్యేకత. ఆ చేపలను ఒక్కసారి రుచి చూస్తే మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది.

శాలిగౌరారం మత్స్య సంపదకు వందల ఏళ్ల చరిత్ర

Three Days Fish Food Festival In Telangana :మనకు ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం ప్రాజెక్టు అంటే ముందుగా గుర్తొచ్చేవి చేపలే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ఊరూరా చెరువుల పండుగ నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు జిల్లా కేంద్రాల్లో చేపల ఆహార పండుగ (ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌)ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిసోంది.

వందల ఏళ్ల చరిత్ర..:మండు వేసవిలో మొత్తం నిండి, వానాకాలం, యాసంగి రెండు పంటలకు సాగు నీరందించే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం ప్రాజెక్టును 1804లో నిజాం కాలంలో నిర్మించారు. అలాగే ఇక్కడున్న మత్స్య సంపదకు కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా 7 గ్రామాల్లోని 10 వేల ఎకరాల వరకు ఆయకట్టుకు సాగు నీరందిస్తోంది.

జలాశయంలో చేపలవేటలో మత్స్యకార్మికుడు

మత్స్య పారిశ్రామికుల సంఘం ఏర్పాటు :ప్రాజెక్టులో చేపల పెంపకంతో ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు జిల్లాకు చెందిన మత్స్య శాఖ 1972లో మత్స్య పారిశ్రామికుల సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 30 మందితో ప్రారంభమైన ఈ సొసైటీ దినదినాభివృద్ది చెందుతూ వస్తూ.. ప్రస్తుతం ఆ సంఖ్య 709 మందికి చేరింది. వారు అక్కడే చేపలను పడుతూ అమ్మకొని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఓ మత్య్స కార్మికుడు ఒక్కరోజు చేపల వేటకు వెళ్లి రూ.300 నుంచి 600 పైగా సంపాదిస్తాడు.

Ponds Festival In Telangana Decade Celebrations 2023 :ఈ చేపలు పెరిగే నీటితో పాటు చెరువు నేల స్వభావం, అందులో పెరిగే నాచు, నీటిలో ఉండే చెట్ల ఆకుల వంటివి చేపల రుచిని మరింత ప్రభావితం చేస్తుంటాయని మత్స్య సొసైటీ ప్రతినిధులు, మత్స్య వ్యాపారులు చెబుతున్నారు.

రుచులు పంచుతూ.. :ఈ ప్రాజెక్టులో ఒక్కో చేప సుమారు 4 నుంచి 20 కిలోల వరకు బరువు ఉంటుంది. చేపలు పడుతున్నారంటే చాలు నల్గొండ, సూర్యాపేట, అర్వపల్లి, తిరుమలగిరి, మోత్కురు, హైదరాబాద్ నుంచి చేపల ప్రేమికులు తరలివచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. దీంతో చిన్న, పెద్ద వ్యాపారులతో ప్రాజెక్టు ప్రాంతం జాతర వాతావరణాన్ని సంతరించుకుంటుంది. శాలిగౌరారం చేపలకు కోల్​కతాలో డిమాండ్ బాగా అధికం. గత కొన్నేళ్ల నుంచి ఇక్కడున్న బొచ్చ, కొర్రమీను, వాలుగ, రవ్వ వంటి పలు రకాల చేపలను వ్యాపారులు కోల్​కతాకే ఎగుమతి చేస్తున్నారు. పోతే ఏడాదికి 50 టన్నులకు పైగా చేపలు అక్కడికి వెళ్తుంటాయి. అలాగే ఈ శాలిగౌరారం చేపలు హైదరాబాద్, రాజమహేంద్రవరం, విజయవాడకు కూడా ఎగువతవుతుంటాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details