ధాన్యాన్ని విక్రయించుకునేందుకు తగినన్ని టోకెన్లు ఇవ్వడం లేదంటూ నల్గొండ జిల్లా మాడ్గులపల్లి వద్ద నార్కట్‌పల్లి రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. భారీ వర్షాల వల్ల పంట నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే కొనుగోలు కేంద్రాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయని వాపోయారు.
ధాన్యం టోకెన్ల కోసం రోడ్డెక్కిన రైతన్నలు - నల్గొండ జిల్లా సమాచారం
ధాన్యం విక్రయించుకునేందుకు సరిపడా టోకెన్లు ఇవ్వడం లేదంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి రహదారిపై ఆందోళన నిర్వహించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం టోకెన్ల కోసం రోడ్డెక్కిన రైతన్నలు
ఐకేపీ కేంద్రాల్లో సన్నవరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయంలో టోకెన్లు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.