డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులతో దేవరకొండ డిఎస్పీ మహేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారురు. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులు ప్రాజెక్టు పనులకు అడ్డుపడకుండా సర్కారుకు సహకరించాలని కోరారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు మాదిరిగానే తమకూ పునరావాసం కల్పించాలని భూనిర్వాసితులు డిమాండ్ చేశారు. ఈ నెల 24న కలెక్టర్, జిల్లా ఎస్పీతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మీ డిమాండ్‌కు ఒప్పిస్తామని డీఎస్పీ మహేశ్ హామీ ఇచ్చారు.
చర్లగూడెం ముంపు బాధితులతో డీఎస్పీ సమావేశం - PROJECT
ప్రభుత్వం చేపడుతున్న డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురవుతున్న చర్లగూడెం గ్రామస్థులతో దేవరకొండ డీఎస్పీ మహేశ్ సమావేశమయ్యారు. ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని డీఎస్పీ కోరారు.
చర్లగూడెం ముంపు బాధితులతో డీఎస్పీ సమావేశం