తెలంగాణ

telangana

ETV Bharat / state

Power Cut dispute: ఆర్టీఏ, విద్యుత్‌ సిబ్బంది మధ్య వివాదం.. మిర్యాలగూడకు కరెంట్​ కట్​ - మిర్యాలగూడ తాజా వార్తలు

రెండు శాఖల అధికారుల మధ్య వివాదం(Power Cut dispute) మిర్యాలగూడ వాసులకు చీకటిని మిగిల్చింది. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకున్న ఆ రెండు శాఖల అధికారుల తీరుపై కరెంట్ రాక... మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డుతున్నారు.

Power stoped power to miryalaguda
మిర్యాలగూడ

By

Published : Aug 5, 2021, 7:42 PM IST

Updated : Aug 5, 2021, 9:42 PM IST

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఉంది నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యుత్​ సిబ్బంది తీరు. ఆర్టీఏ అధికారులతో గొడవపడి మిర్యాలగూడకు విద్యుత్​ నిలిపేశారు ఆ శాఖ అధికారులు. ఆర్టీఏ, విద్యుత్‌ సిబ్బంది మధ్య వివాదంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు.

ఏం జరిగింది...

ఆర్టీఏ కార్యాలయంలో విద్యుత్​ సిబ్బంది ప్రీపెయిడ్‌ మీటర్ అమర్చారు. రీఛార్జ్‌ చేసుకోకపోవడంతో ఆర్టీఏ కార్యాలయానికి సరఫరా నిలిచింది. దీనిపై ఆర్టీఏ, విద్యుత్‌శాఖ సిబ్బంది మధ్య వాగ్వాదం(Power Cut dispute) జరిగింది.

తరువాత విద్యుత్‌ సిబ్బంది వాహనాలకు ఆర్టీఏ అధికారులు జరిమానా విధించారు. ఈ వ్యవహారంపై విద్యుత్‌ శాఖ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ... మిర్యాలగూడ పట్టణం మొత్తానికి 40 నిమిషాల పాటు కరెంట్ సరఫరా నిలిపివేశారు. రెండు శాఖల సిబ్బంది మధ్య వివాదం వల్ల మిర్యాలగూడ వాసులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు గొడవపడితే తమకేంటి సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై సీనియర్ అధికారుల వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు.

Power Cut dispute: ఆర్టీఏ, విద్యుత్‌ సిబ్బంది మధ్య వివాదం.. మిర్యాలగూడకు కరెంట్​ కట్​

'విద్యుత్​ కార్యాలయంలో ఉన్న మా వాహనాలను ఆర్టీవో అధికారి వచ్చి సీజ్​ చేశారు. మా వాహనాలను ఆర్టీసీ సముదాయ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. ఆర్టీఏ కార్యాలయం కరెంటు బిల్లు కట్టలేదు. దీంతో విద్యుత్​ నిలిచిపోయింది. దానికి మేం ఏం చేయాలేం. అన్యాయంగా మా వాహనాలు సీజ్​ చేశారు. అందుకు నిరసనగా విద్యుత్​ నిలిపివేశాం.'

-సోమా చారి, విద్యుత్​ సిబ్బంది

ఇదీ చదవండి:GRMB: జీఆర్ఎంబీ బోర్డు సమావేశానికి హాజరుకావటం లేదు: తెలంగాణ

Last Updated : Aug 5, 2021, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details