తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీటీసీ పవిత్రపై క్రిమినల్​ కేసు

నల్గొండ జిల్లా చందంపేట మండల జడ్పీటీసీ రమావత్​ పవిత్రపై క్రిమినల్​ కేసు నమోదు అయింది. మొన్న జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో కనీస అర్హత తప్పుగా చూపించి పోటీ చేశారని మరో జడ్పీటీసీ అభ్యర్థి నేనావత్​ బుజ్జి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

జడ్పీటీసీ పవిత్రపై క్రిమినల్​ కేసు

By

Published : Jun 29, 2019, 9:24 AM IST

జడ్పీటీసీ పవిత్రపై క్రిమినల్​ కేసు
నల్గొండ జిల్లా చందంపేట మండల జడ్పీటీసీ పవిత్రపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మే నెలలో జరిగిన జిల్లా ప్రాదేశిక ఎన్నికలలో జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన పవిత్రకు పదో తరగతి మార్కుల జాబితా ప్రకారం 19 ఏళ్లు ఉంటే మార్పింగ్​ చేసి 21గా చూపించారని మరో అభ్యర్థి నేనావత్​ బుజ్జి ఫిర్యాదు చేశారు. అలాగే బిల్డింగ్​ తండా గ్రామపంచాయతీ పీఎస్​ 58లో ఉన్న 350 ఓటర్లలో కూడా 19 సంవత్సరాలుగా ఉన్నాయన్నారు. కేవలం పదవికోసమే ఓటు హక్కు ఉన్నా కూడా ఓటర్ల సంఖ్య 384గా చేయించి 21 ఏళ్లు వచ్చే విధంగా సృష్టించరన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థికి కనీస అర్హత వయసు 21 ఏళ్లు ఉండాలి కనుకే అధికారులను తప్పుదోవ పట్టించి.. పోటీ చేశారని బుజ్జి ఫిర్యాదులో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details