తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ప్రజలు మళ్లీ ఉద్యమం చేయక తప్పదు: చాడ

కొట్లాడి ప్రత్యేక తెలంగాణ సాధించుకుంది మా నీళ్లు, మా నిధుల కోసమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు జీవో 203ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

cpi state secretery chada venkatareddy serious on govt
తెలంగాణ ప్రజలు మళ్లీ ఉద్యమం చేయకతప్పదు: చాడ

By

Published : Jun 6, 2020, 7:16 PM IST

దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట​రెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లాలోని ఎస్​ఎల్​బీసీ, డిండి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్​ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు జీవో 203 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రత్యేక తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది మా నీళ్లు, మా నిధుల కోసమని వెంకట​రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి ఆరేళ్లు గడిచినా.. ఎస్​ఎల్​బీసీ, డిండి మొదలైన ప్రాజెక్టులను సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్ తమ వాటాకు వచ్చే నీళ్లు మాత్రమే తీసుకెళుతున్నామని చెబుతుంటే.. కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు దీనిపై నోరు విప్పడం లేదని ఎద్దేవా చేశారు.

నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్​నగర్, ఖమ్మం మొదలైన జిల్లాలను ఎడారిగా మార్చడం ఖాయమని.. తెలంగాణ ప్రజలు మళ్లీ ఉద్యమం చేయక తప్పదని ఆయన హెచ్చరించారు.

సదస్సులో సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్​రెడ్డి, రిటైర్ట్ తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కన్వీనర్ డి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజలు మళ్లీ ఉద్యమం చేయకతప్పదు: చాడ

ఇదీచూడండి: జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి పరీక్షలు వాయిదా

ABOUT THE AUTHOR

...view details