అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో రూ.3వేల కోట్లతో 13 లిప్ట్ ఇరిగేషన్లను మంజూరు చేసిన ఘనత సీఏందేనని నల్గొండలోని తన కార్యాలయంలో తెలిపారు. రైతు సంక్షేమం కోసం నిరంతరం కేసీఆర్ కృషి చేయడం వల్లే అధిక పంటల పండించడంలో పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
డిండి ఎత్తిపోతల పథకం, బ్రాహ్మణ వెల్లంల, శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ హామీ ఇచ్చారని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాదిలోపు పనులు పూర్తి అవుతాయని తెలిపారు.