Corona in School: స్కూల్లో కరోనా కలకలం.. వారివల్లే సోకిందా..! - corona in govt school
17:33 November 10
Corona in School: స్కూల్లో కరోనా కలకలం..వారివల్లే సోకిందా..!
ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం రేకెత్తించింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని చెన్నారం గేట్ వద్ద ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు, ఉపాధ్యాయులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు పాఠశాలలోని వసతి గృహాలకు చేరుకున్నారు.
కరోనా లక్షణాలున్న ఎనిమిది మంది విద్యార్థినులు, ఇద్దరు టీచర్లకు పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. వారిలో ఆరుగురు విద్యార్థినులు, ఇద్దరు టీచర్లను హోం క్వారంటైన్‌కు పంపారు. మరో ఇద్దరు విద్యార్థినులను పాఠశాలలోనే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే స్కూల్‌కు వచ్చినప్పుడు అందరు ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రుల వల్లే వైరస్ సోకి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: