పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆరోపించారు.
పెంచుతున్న ముడిచమురు ధరలు తగ్గించాలని నిరసన - latest news of nalgonda
ముడి చమురు ధరలను తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్గొండ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
పెంచుతున్న ముడిచమురు ధరలపై నల్గొండలో నిరసన
మోదీ, కేసీఆర్ చెప్పిన మాటలకూ.. చేసే చేతలకూ సంబంధం లేకుండా ఉందని జిల్లా డీసీసీ అధ్యక్షుడు శశాంక్ నాయక్ విమర్శించారు. వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?