నల్గొండ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు, మునుగోడు మండలాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. నీరంతా దిగువ ప్రాంతానికి వృథాగా పోయాయి. చండూరు మండలంలో 15ఎకరాల పత్తిపంట నీటిలో మునిగిపోయింది. మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో రెండున్నర ఎకరాల పత్తిపంట వరదలో కొట్టుకుపోయింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరారు.
చెరువులకు గండి... నీట మునిగిన పంటలు - చెరువులకు గండి
నల్గొండ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు మునుగోడు నియోజకవర్గంలో పలు చెరువులకు గండి పడ్డాయి. పత్తి పంట నీటమునగటం వల్ల అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు.
చెరువులకు గండి... నీట మునిగిన పంటలు