నల్గొండ జిల్లా నందికొండ పురపాలక సంఘం నిర్వహణపై కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులతో సమీక్షించారు. పారిశుద్ధ్య నిర్వహణకు రెండు ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. తాత్కాలిక ప్రాతిపదికన కార్మికులను తీసుకోవాలని సూచించారు. తాగునీటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ఓటరు జాబితా సిద్ధం చేయాలన్నారు. అనంతరం కమలా నెహ్రూ ప్రభుత్వాసుపత్రి తనిఖీ చేశారు. వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు. విధులకు రానీ వైద్యులు కలెక్టరేట్లో హాజరు కావాలని ఆదేశించారు.
నందికొండ పురపాలికలో కలెక్టర్ సమీక్ష - collector
నందికొండ పురపాలక సంఘంలో బుధవారం నల్గొండ జిల్లా పాలనాధికారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం ట్రాక్టర్ల కొనుగోలుకు ఆదేశించారు.
నందికొండ పురపాలికలో కలెక్టర్ సమీక్ష