తెలంగాణ

telangana

ETV Bharat / state

బంగారిగడ్డలో నేడు సీఎం కేసీఆర్ బహిరంగసభ.. - సీఎం తాజా వార్తలు

cm kcr meeting in chandur: ఈరోజు ముఖ్యమంత్రి, తెెెెరాస అధినేత కేసీఆర్ చండూరు మండలానికి వెళ్లనున్నారు. సీఎం హెలికాఫ్టర్​లో బంగారిగడ్డకు చేరుకోని, అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభకు హాజరుకానున్నారు. సభ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. అగస్టు 21న మునుగోడు సభలో కేంద్రం, భాజపా తీరుపై విమర్శలు చేసిన కేసీఆర్‌ ఈ సభలోనూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారని అంచనా వేస్తున్నారు.

cm kcr meeting in chandur
cm kcr meeting in chandur

By

Published : Oct 30, 2022, 7:49 AM IST

cm kcr meeting in chandur: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ఈరోజు చండూరు మండలానికి వెళ్లనున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బంగారిగడ్డకు చేరుకోనున్న సీఎం.. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభం కానుంది.

ఎమ్మెల్యేలకు ఎర అంశం చర్చనీయాంశంగా మారడంతో సీఎం ఏం మాట్లాడతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై కేసీఆర్ మాట్లాడుతారని మంత్రి కేటీఆర్ పరోక్షంగా వెల్లడించిన నేపథ్యంలో సభపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు సభ ద్వారా ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలని, క్షేత్రస్థాయిలోనూ జోష్‌ నింపాలని గులాబీనేతలు భావిస్తున్నారు.

అగస్టు 21న మునుగోడులో జరిగిన సభలో కేంద్రం, భాజపా తీరుపై విమర్శలు చేసిన కేసీఆర్‌ ఈ సభలోనూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీనేతలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఓటర్లకు సభకు తరలించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐతే.. మంత్రి జగదీశ్‌రెడ్డిని మీడియాతో పాటూ సభలు, సమావేశాల్లో 48 గంటల పాటూ మాట్లాడకుండా ఈసీ ఆంక్షలు విధించిన అంశాన్ని సైతం బహిరంగ సభలో ప్రస్తావిస్తారని తెలిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details